యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నవిషయం తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్ర షూటింగ్‌ని పూర్తి చేసిన ప్రభాస్.. సలార్ అనే చిత్రం చేస్తున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమా షూటింగ్‌కి కూడా కరోనా బ్రేక్ వేసింది. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు లీకుల బెడద పట్టుకుంది.
గతంలో సలార్ చిత్ర లొకేషన్ నుండి పలు ఫొటోలు, వీడియోలు బయటకి రాగా ఇవి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చాయి. తాజాగా సలార్ షూటింగ్ స్పాట్ నుండి ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో లీకైంది. ఇది సినిమాలో సన్నివేశానికి సంబంధించినది కాదు.. కానీ సలార్ షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ గెటప్ ని రివీల్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు.
సలార్ చిత్రంలో ప్రభాస్.. మాఫియా ప్రపంచంలో ఎదురు లేని వీరుడిగా కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన లుక్ అదే గుర్తు చేస్తుంది. లీక్డ్ ఫుటేజ్ బయటికు రావడంతో చిత్రబృందం సీరియస్ గా ఉందని సమాచారం. సలార్ చిత్రం 2022 ఏప్రిల్ 22న సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది. దాదాపు 150-200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని కథనాలొస్తున్నాయి. హోంబలే సంస్థ ఈ మూవీని పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేయనుంది. ఈ సినిమాతో పాటుగా ఆదిపురుష్ 3డి .. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ చిత్రాలు చేస్తున్నాడు ప్రభాస్.