తెలుగు దనం ఉట్టిపడేలా కనిపిస్తూ..తన యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది అలనాటి అందాల తార లయ (Laya). ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్, స్వరాభిషేకం, విజయేంద్రవర్మ, చాణక్య చిత్రాలతోపాటు మరెన్స్ హిట్ చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఈ తార మళ్లీ కనిపించలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో స్టన్నింగ్ డ్యాన్స్ వీడియోతో అందరినీ పలుకరించింది లయ.
టాప్ ట్రెండింగ్ సాంగ్ కచ్చా బాదమ్ పాట (Kacha Badam dance)కు తన స్నేహితురాలితో కలిసి స్టెప్పులేసింది లయ. చీరకట్టులో స్నేహితురాలితో కలిసి ట్రెండీ పాటను ట్రెండీ స్టెప్పులేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది లయ. చాలా కాలం తమ అభిమాన హీరోయిన్ ఇలా డ్యాన్సింగ్ వీడియోతో ప్రత్యక్షమవడంతో ఫాలోవర్ల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రతీ క్షణం ఏదో ఒక మ్యాజిక్ కోసం చూడటం..అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
తాజా వీడియోతో తాను సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని లయ చెప్పకనే చెప్తోంది. మరి రాబోయే కాలంలో సిల్వర్ స్క్రీన్ పై ఎలా రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.