Lavanya Tripathi | మెగా బ్రదర్ ముద్దుల తనయుడు వరుణ్ తేజ్‌ని వివాహం చేసుకొని మెగా కోడలిగా మారింది లావణ్య త్రిపాఠి. ఈ జంట కొన్నాళ్లు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని అనంతంరం పెళ్లి పీటలెక్కారు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మాల్దీవులలో ఈ ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వారు ఇలా టూర్ కు వెళ్ళినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాల్దీవుల విహారయాత్ర నుండి ఒక పిక్‌ని లావణ్య త్రిపాఠి షేర్ చేసింది. మాల్దీవ్స్‌కి వెళ్లిన లావణ్య తన ఇన్‌స్టాలో భర్తతో కలిసి దిగిన పిక్ షేర్ చేయగా, ఇందులో లావణ్య బేబి బంప్‌తో కనిపిస్తుంది.
ఇది చూసి నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. వెయిటింగ్ అంటూ ఆ పోస్ట్‌కి కామెంట్స్ పెడుతున్నారు. కాగా, 2023 నవంబర్‌లో ఇటలీలో జరిగిన ఒక విలాసవంతమైన డెస్టినేషన్ వివాహంలో వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా విహార యాత్రలకి వెళుతూ అందమైన క్షణాలను పంచుకుంటారు మరియు ఇప్పుడు లావణ్య పంచుకున్న పోస్ట్ మాత్ర వైరల్ అయింది. లావణ్య బేబి బంప్ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. లావణ్య కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమా రంగానికి దూరమైన లావణ్య, ఇటీవల ఒక సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత తాను గర్భవతి కావడంతో ఆ షూటింగ్ కూడా మధ్యలోనే ఆపేసి, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే ఇటీవల లావణ్య తన పెంపుడు కుక్క మరణించడంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క మృతి చెందిన విషయాన్ని లావణ్య తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన పెంపుడు కుక్క మరణం లావణ్యని తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది.