లీలావతి ఆద్యంతం నవ్విస్తుంది
‘ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. ఫ్యామిలీకే టైం కేటాయిస్తున్నా. నా బాబుతోనే సమయం గడచిపోతున్నది.. అందుకే సినిమాలకు కాస్త విరామం తీసుకుంటాను’ అని చెప్పింది కథానాయిక లావణ్య త్రిపాఠి.
‘ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. ఫ్యామిలీకే టైం కేటాయిస్తున్నా. నా బాబుతోనే సమయం గడచిపోతున్నది.. అందుకే సినిమాలకు కాస్త విరామం తీసుకుంటాను’ అని చెప్పింది కథానాయిక లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వినోదాత్మక చిత్రం ‘సతీ లీలావతి’ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. తాతినేని సత్య దర్శకుడు.
ఈ సందర్భంగా బుధవారం లావణ్య త్రిపాఠి విలేకరులతో ముచ్చటించింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే తాను ప్రెగ్నెట్ అయ్యానని, టీమ్ అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ పూర్తిచేశానని చెప్పింది. ‘ఈ సినిమాలో నేను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఈ కథలో వినోదంతో పాటు చక్కటి సందేశం ఉంటుంది. హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయి’ అని లావణ్య త్రిపాఠి తెలిపింది. రామ్‌చరణ్ ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారని, ఈ సినిమా ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించిందని ఆమె తెలిపింది.
వరుణ్‌తేజ్ రూపంలో తనకు అర్థం చేసుకునే భర్త దొరికాడని, ప్రస్తుతం తాము బాబుతో కలిసి హ్యాపీగా ఉన్నామని లావణ్య త్రిపాఠి చెప్పింది. ‘వరుణ్‌తేజ్‌తో కలిసి నటించాలనుంది. మేం రియల్‌లైఫ్‌లో కలిసే ఉన్నాం. కాబట్టి తెరపై మా జంట కొత్తగా కనిపించాలంటే కథ విభిన్నంగా ఉండాలి. అలాంటి వైవిధ్యమైన కథ దొరికితే భవిష్యత్తులో తప్పకుండా కలిసి నటిస్తాం’ అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

