కెరీర్ మొదట్లో హోమ్లీ హీరోయిన్గా అద్భుతమైన పాత్రలు పోషించి మెప్పించింది లావణ్య త్రిపాఠి. 2012లో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ ఇప్పటి వరకు 16కి పైగా చిత్రాల్లో నటించింది. లావణ్యకు భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. నాగార్జునను మినహాయిస్తే టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది.
వెండితెరపై నిండుగా కనిపించే లావణ్య ఈ మధ్య కొత్త అవతారం ఎత్తింది. స్కిన్ షోకి తెరలేపుతూ ఎలాంటి పాత్రకైనా సిద్దమే అన్న సందేశం దర్శక నిర్మాతలకు పంపుతుంది. ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంది.తాజాగా కారు అద్ధం చాటు నుండి అందాలను ఆరబోస్తూ కవ్విస్తుంది. లావణ్య క్యూట్ పిక్ చూసి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఆమెలోని కొత్త యాంగిల్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.