ee raathale song from Radhe shyam | రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాధే శ్యామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతుంది ఈ సినిమా. మరోవైపు రాధే శ్యామ్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు యు.వి.క్రియేషన్స్ ట్విట్టర్ లో నానా హంగామా చేస్తున్నారు అభిమానులు. తమ హీరో సినిమాకి సంబంధించిన కొత్త కొత్త అప్డేట్ చెప్పాలంటూ వాళ్ళను ఒక విధంగా టార్చర్ పెడుతున్నారు. దాంతో సినిమా యూనిట్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు.
మొన్నటికి మొన్న ఈ సినిమాకు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అంటూ కొత్త విషయం చెప్పారు. హిందీలో బిగ్ బి వాయిస్ ఓవర్ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని మేకర్స్ కూడా ఎంతో ఆశగా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో సూపర్ సర్ప్రైజ్ న్యూస్ చెప్పారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా నుంచి లిరికల్ సాంగ్స్ అన్ని బయటకు వచ్చాయి. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియో సాంగ్స్ కూడా బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 2 గంటలకు ఈ రాతలే పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఫిబ్రవరి 25న ఫుల్ వీడియో సాంగ్ బయటకు రానుంది. మార్చి 11న ఈ సినిమా విడుదల కానుంది.
విధికి, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ. 1970ల ఈ నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథ ఇది అంటూ చెప్పారు రాధాకృష్ణ కుమార్. ఇటలీ హైదరాబాద్ లోని అందమైన లోకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా విడుదలకు ముందే వీడియో సాంగ్స్ అన్ని బయటకు రానున్నాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో ముందుగానే వీడియో సాంగ్స్ విడుదల చేసి ఈ సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.