Adipurush Trailer | మరో నెలన్నర రోజుల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. నిన్న, మొన్నటి వరకు సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ, గత రెండు వారాల నుంచి చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, లిరికల్ సాంగ్ ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవలే రిలీజైన అప్డేట్ టీజర్ కూడా కాస్త బెటర్‌గానే అనిపించింది. వీఎఫ్ఎక్స్లో చాలా వరకు మార్పులు చేసినట్లు కనిపించింది. ఆ స్థాయిలో సినిమా ఉంటే రికార్డులు ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ప్రమోషన్లో భాగంగా మే 9న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో పెద్ద ఎత్తున జరుపుతున్నట్లు సమాచారం. ఇక అదే రోజున ట్రైలర్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, మరీ సినిమాకు నెల రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ అంటే.. సినిమా విడుదల సమయానికి భారీ హైప్ ఉంటుందా అని పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఎంత ప్రెస్మీట్లు, ఇంటర్వూలు చేసిన ఒక్క ట్రైలర్ చాలు సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి. అలాంటి ట్రైలర్‌ను నెల రోజుల ముందే రిలీజ్ చేయడం కాస్త రిస్క్ ఏమో అని అంటున్నారు.
రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందే న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా మూడు రోజుల పాటు ప్రదిర్శితం కానుంది. కాగా తొలిరోజుకు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయట.