Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలామ్ (Lal Salaam) చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదిక అయిన Sun NXT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. గతేడాది ఫిబ్రవరి 09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించినంత విజయం అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా విడుదలైన దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో కట్ వెర్షన్‌ని విడుదల చేయగా.. ఓటీటీలో మాత్రం ఎక్స్టెండెడ్ వెర్షన్‌ని విడుదల చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఇండియన్ మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.
కథ విషయానికి వస్తే.. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ ఉంటుంది. కసుమూరు అనే గ్రామంలో హిందూ, ముస్లింలు ఎంతో ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారు. ఈ ఊరిలో ఒకరైన మొయిద్దీన్ (రజనీకాంత్) కసుమూరు నుంచి ముంబయికి వలస వెళ్లి, అక్కడ అంచలంచెలుగా ఎదిగి ఓ గొప్ప వ్యాపారవేత్తగా మారతాడు. అయితే తన ఏకైక కుమారుడు షంషుద్దీన్ (విక్రాంత్) ను ఓ గొప్ప క్రికెటర్‌గా చూడాలన్నది మొయిద్దీన్ కల. అయితే, మొయిద్దీన్ గ్రామం వదిలి వెళ్ళిన తర్వాత, కొందరు రాజకీయ నాయకులు వారి అవసరాలు కోసం ప్రజలు మధ్య మత అలజడులను సృష్టిస్తారు. ఈ క్రమంలోనే కనుమూరులో త్రీస్టార్, ఎంసీసీ రెండు క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా మతం రంగు పులుముకుంటుంది. ఒకరోజు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, పెద్ద గొడవ జరుగుతుంది. ఈ ఘర్షణలోనే గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్) షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు. అయితే అసలు క్రికెట్లో జరిగిన ఆ గొడవకు కారణమేమిటి? షంషుద్దీన్ చేయి నరికేసేంత కోపం గురుకు ఎందుకొచ్చింది?తన కొడుకు చేయి నరికిన గురుపై మొయిద్దీన్ ఎలా స్పందించాడు? గ్రామంలో జరిగే జాతరకు, ఈ మత కల్లోలాల కథకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Step into the world of Lal Salaam! 🔥
Lal Salaam – The Extended Version streaming now on Sun NXT#LalSalaamOnSunNXT #LalSalaam #Rajinikanth #VishnuVishal #Vikranth #AishwaryaRajinikanth #ARRahman #AnanthikaSanilkumar #DhanyaBalakrishna #SunNXT pic.twitter.com/p64LOFTLXD
— SUN NXT (@sunnxt) June 5, 2025