Vishwak Sen – Laila Promotions | ఈ మధ్య మూవీ ప్రెస్ మీట్లలో తెలుగు ఫిలిం జర్నలిస్టుల ప్రశ్నలు మితిమీరుతున్నాయి. అప్పుడప్పుడు ఏం అడుగుతున్నారు అనేది కూడా ఆలోచించకుండా అడిగేస్తుంటారు. ఇప్పటికే పలు మూవీ ప్రెస్ మీట్లలో సురేష్ కొండేటి వింత వింత ప్రశ్నలు అడిగి నటులతో పాటు ప్రేక్షకులకు కోపం తెప్పించాడు. రీసెంట్గా మహిళ జర్నలిస్ట్ కూడా ఇలానే అడగడంతో అమెకు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ ఘటనలు మర్చిపోకముందే మరో జర్నలిస్ట్ తన నోటి దూరుసుతో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.
నటుడు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. ఈ సినిమాకు దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా.. సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లేడి పాత్రలో నటిస్తున్నాడు విశ్వక్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.
గురువారం ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. విశ్వక్ సేన్ పాల్గోనగా.. అతడిని ఒక జర్నలిస్ట్ అడుగుతూ.. లైలా ఎలా ఉందంటే.. ఇప్పుడు ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతున్న మోనాలిసా లాగా ఉందని కొందరూ అంటుండగా.. మరికొందరూ.. కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందని అంటున్నారు. దీనికి మీ రెస్పాన్స్ ఏంటీ అని విశ్వక్‌ని అడుగుతాడు. దీనికి విశ్వక్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా ఎంత అన్యాయం అంటూ విశ్వక్ సేన్ సమాధానమిస్తాడు.
అయితే దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదేం జర్నలిజం. ఇలా కూడా అడుగుతున్నారా మీడియాలో అంటూ సదరూ జర్నలిస్ట్‌పై దుమ్మొత్తిపోస్తున్నారు.
సినిమా ప్రమోషన్లలో మితిమీరుతున్న ప్రశ్నలు
లైలా కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్న జర్నలిస్ట్
ఇంటర్నేషనల్ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా ఎంత అన్యాయం రా అంటూ సమాధానమిచ్చిన హీరో విశ్వక్ సేన్ pic.twitter.com/cU5O9x2Qrh
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025
Kphb aunty ante prostitute aa? Is this some new slang term? Disgusting label https://t.co/I69mx1tokn
— Kaustubh (@DexterousRd) January 24, 2025
Ananya Nagalla’s Strong Stand Against Casting Couch Allegations #AnanyaNagalla pic.twitter.com/WsXrfi8JEJ
— Telugu Film Producers Council (@tfpcin) October 18, 2024