సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. తెలంగాణలో జరిగే పెళ్లి నేపథ్యంలో కుటుంబ విలువలకు దర్పణంలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, తెలంగాణదనం ఉట్టిపడే ఈ కథలో పెళ్లి ప్రాశస్త్యాన్ని, కుటుంబ విలువల గొప్పతనాన్ని ఆవిష్కరించామని, పెళ్లి ఘట్టం కన్నులపండువగా ఉంటుందని దర్శకుడు రమేష్ చెప్పాల పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, దర్శకత్వం: రమేష్ చెప్పాల.