Laggam Movie | యువ నటులు సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. పెళ్లి నేపథ్యంలో తెలుగు సంప్రదాయాలను కళ్లకు కడుతూ తెరకెక్కెతున్న ఈ సినిమాకు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహిస్తుండగా.. నటకిరిటి రాజేంద్రప్రసాద్ చాలా రోజుల తర్వాత కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్.
ఈ నెల 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ లగ లాగ లగ్గం సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో చక్కటి ప్రేమకథగా అలరిస్తుంది’ అన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. సుభిషి ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రమేష్ చెప్పాల. మరోవైపు ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకుంది.
#Laggam first single on 21st June #Rajendraprasad @rajcramesh1 #Venugopalreddy @saironak3 @pragyanagra pic.twitter.com/FVDEsFdFWL
— Suresh PRO (@SureshPRO_) June 16, 2024