నిర్మాత లగడపాటి శిరీషశ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వర్జిన్ స్టోరి’. ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ ఉపశీర్షిక. ప్రదీప్ బి అట్లూరి దర్శకుడు. ఈ సినిమాలో మూడో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సహనం ఉంటే ప్రేమ దక్కుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం వినోదప్రధానంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాలెంటైన్స్‌డే కానుకగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్లో విడుదల చేస్తాం’ అన్నారు ఈ చిత్రానికి కెమెరా: అనీష్ తరుణ్, సంగీతం: అచ్చు రాజమణి, నిర్మాతలు: లగడపాటి శిరీషా శ్రీధర్.