Lucifer 2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer). పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాలో మంజు వారియర్ (Manju Warrier), వివేక్ ఒబెరాయ్ (Vivek Oberai), టోవినో థామస్(Tovino Thomas), ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గాడ్ ఫాదర్ (God Father) పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. తెలగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రం నుంచి సీక్వెల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. లుసిఫర్ 2 ఎంపురాన్ (Lucifer 2 Empuraan) అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండగా.. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్.
ఈ మూవీ షూటింగ్ ఈరోజు ఉదయం 5:35 గంటలకు, మలంపూజ రిజర్వాయర్ ఒడ్డున కంప్లీట్ అయ్యిందని.. సినిమాని కూడా మార్చి 27 2025న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇక సీక్వెల్‌కు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం చేయనుండగా మురళి గోపి స్టోరీ అందిస్తున్నాడు. కాగా ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ మరింత స్టైలిష్‌గా కనిపించనున్నట్లు టాక్.
ఇదిలా ఉంటే.. పృథ్విరాజ్‌కు దర్శకుడిగా ఇది మూడో సినిమా. మూడు సినిమాల్లో మోహన్‌లాల్ ప్రధాన హీరోగా ఉండటం విశేషం. ఇక ఈ సీక్వెల్ సినిమాను డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టే లైకా సంస్థ టేకోవర్ చేసుకుంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.