Kunal Kapoor | పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్(Kunal Kapoor) కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్. ఇక చిరంజీవితో విశ్వంభర చేస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఎంఎం కీరవాణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
CHIRANJEEVI – ‘VISHWAMBHARA’: KUNAL KAPOOR SIGNED FOR PIVOTAL ROLE… SANKRANTI 2025 RELEASE… UV Creations’ #Vishwambhara – a fantasy adventure starring #Chiranjeevi and directed by #Vassishta – makes a fresh announcement… #KunalKapoor will essay a pivotal character.
Also… pic.twitter.com/IT1oXyZOcU
— taran adarsh (@taran_adarsh) June 14, 2024