Sir Collections | చాలా సంవత్సరాలుగా సరైన విజయం కోసం వెయిట్ చేస్తున్న ధనుష్‌కు మొత్తానికి తెలుగు దర్శకుడు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. యావరేజ్ టాక్‌తో మొదలైన `సార్` సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. మూడు రోజులు ముగిసే సరికి ఈ సినిమా రెండు భాషల్లో కలిపి రూ.51 కోట్లు వసూలు చేసింది. ధనుష్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇదే. దాంతో ఈ హీరో పండగ చేసుకుంటున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన `సార్` అంచనాలను నిలబెట్టుకుని అద్భుతమైన విజయం దిశగా అడుగులు వేస్తున్నది.
కంటెంట్ యావరేజ్ గానే ఉన్నా, ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చున్ 4 సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. ఈయన కెరీర్‌కు కూడా `సార్` విజయం కీలకంగా మారింది. కంటెంట్ ఓల్డ్.. ఇప్పటి జనరేషన్‌కు ఎక్కుతుందా అనే అనుమానాలు వచ్చినా కూడా.. శివరాత్రి వీకెండ్ సినిమాకు బాగా కలిసి వచ్చింది. మూడు రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడంతో అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది.
తెలుగులో అయితే కేవలం రూ.7 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా.. ఏకంగా రూ.9 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటి నుంచి వచ్చేవన్నీ నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలే. మరోవైపు తమిళంలో కూడా ఈ సినిమా ఇప్పటికీ రూ. 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మరో రూ.6 కోట్లు వసూలు చేస్తే అక్కడ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా దూకుడు చూస్తుంటే 50 కోట్ల షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది. ఇదే జరిగితే ధనుష్ కెరీర్ లో చాలా రోజుల తర్వాత అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇదే అవుతుంది. మరోవైపు వెంకీ అట్లూరి కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే తొలిప్రేమ సినిమా ఏదో హిట్ అంటే హిట్ అన్నట్టు నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఇలాంటి సమయంలో వచ్చిన `సార్` మంచి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని కూడా అందించడంతో చిత్ర యూనిట్ అందరూ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి మరోసారి ధనుష్‌తోనే సినిమా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎడ్యుకేషనల్ సిస్టమ్‌ను టార్గెట్‌గా చేసుకొని చేసిన `సార్` సినిమాకు ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్ళు బాగా కనెక్టవుతున్నారు. దాంతో పాటు లక్షల ఫీజులు కడుతున్న పేరెంట్స్ కూడా ఈ సినిమా చూసి ఎమోషనల్ అవుతున్నారు.