Kuberaa movie Censor Complete | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కుబేరా’ (Kuberaa). ఈ ప్రాజెక్ట్‌లో తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను అందజేసింది. అలాగే 181 నిమిషాల భారీ రన్‌టైంతో ఈ సినిమా విడుదల కాబోతుంది. మరోవైపు ఈ చిత్రానికి 19 కట్స్ చెప్పినట్లు సమాచారం.
181 minutes of drama, emotion, love, greed, thrill, and everything in between!#Kuberaa – A complete U/A socio-drama that promises a fresh cinematic experience ❤️🔥
Book your tickets now: https://t.co/w7l02LQuk7 #Kuberaa in cinemas June 20, 2025.#SekharKammulasKuberaa… pic.twitter.com/od1JCT6fZ7
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 18, 2025