BRS Working President KTR | ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్.. శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.