Actress Kriti Sanon | కెరీర్ బిగెనింగ్ నుండి నటన ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కృతి సనన్. ‘1 నేనొక్కడినే’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన కృతి అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇక ఇటీవలే ఈమె నటించిన భేదియా విడుదలైంది. రిలీజ్ రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్ళతో దూసుకుపోతుంది. ఈ చిత్రం తెలుగులో తోడేలుగా రిలీజైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ అవకాశం వస్తే ప్రభాస్‌ను పెళ్ళి చేసుకుంటా అని తన మనసులో మాట బయటపెట్టింది.
విషయమేంటంటే.. ఓ టీవి డిబెట్లో కృతి సనన్‌కు కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్ వీరిలో ఎవరిని పెళ్ళి చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ అమ్మడు ప్రభాస్‌ను పెళ్ళి చేసుకుంటా అని సమాధానం ఇచ్చింది. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్, కృతి కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించారు. కాగా వీరిద్ధరూ ఆదిపురుష్ ప్రెస్మీట్లలో, టీజర్ ఈవెంట్లో క్లోజ్‌గా ఉండటంతో వీరిద్ధరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఈ ఇద్దరూ స్పందించలేదు. ఇక ఇప్పుడు ఏకంగా కృతి, ప్రభాస్‌ను పెళ్ళి చేసుకుంటా అని మనసులో మాట బయటపెట్టంది.
మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, కృతి సీత పాత్రలో నటిస్తుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో.. వీఎఫ్ఎక్స్పై మరింత శ్రద్ధ పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకుని సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేశారు.