పాన్ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో ప్రభాస్ సరసన నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది కృతి సనన్. ఈ భామ ప్రభాస్‌తో డేటింగ్లో ఉందనే వార్త హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ తనకు మంచి మిత్రుడని, అంతకుమించి ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితం స్పష్టం చేసింది కృతిసనన్. తాజా ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్‌ను ప్రశంసల్లో ముంచెత్తింది. అతిథ్యంలో ఆయనకు సాటెవరూ లేరని చెప్పింది.
కృతిసనన్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం నేను తెలుగు బాగా మాట్లాడుతున్నా. అందుక్కారణం ప్రభాసే. ‘ఆదిపురుష్’ సెట్లో ఆయన నాకు తెలుగు నేర్పించారు. ఈ విషయంలో ప్రభాస్‌కు థాంక్స్ చెప్పాలి. నాకు తెలుగు నేర్పించినందుకు ప్రతిగా నేను ప్రభాస్‌కు హిందీ నేర్పించాను. ఇప్పుడు ఆయన చక్కటి హిందీ మాట్లాడుతున్నారు. మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే గాసిప్స్ వచ్చాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి. అందరితో స్నేహంగా ఉంటారు’ అని చెప్పుకొచ్చింది.