Delhi Air Pollution | బాలీవుడ్ నటి కృతి సనన్ ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం (Air Pollution) గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీ ఎలా ఉండేదో తనకు తెలుసని కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారుతోందని ఆమె తన ఆవేదనను పంచుకున్నారు. కృతి కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishq Mein). ఈ సినిమాలో ధనుష్ కథానాయికుడిగా నటిస్తుండగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా.ఈ వేడుకలో కృతి మాట్లాడుతూ.. ఢిల్లీలో కాలుష్యంపై స్పందించింది.
”ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్నదాని కంటే మరింత దారుణంగా మారబోతుంది. నేను ఢిల్లీ వాసినే. గతంలో ఇక్కడి పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసు, ఇప్పుడు అది మరింత దిగజారిపోతోంది. దీనిని అడ్డుకోవడానికి తక్షణమే ఏదైనా చేయాలి. లేకపోతే మనం పక్కపక్కనే నిలబడ్డా కూడా పొగ మంచు, ధూళి కారణంగా ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితికి చేరుకుంటాం”. అంటూ కృతి చెప్పుకోచ్చింది.
Pollution in Delhi is getting worse and worse. I’m from Delhi and I know what it used to be earlier, and it is getting worse.
Something needs to be done to stop it. Otherwise, it will reach a point where we won’t be able to see each other standing next to us.
—Kriti Sanon pic.twitter.com/ANvtd95Bd4
— Mohit Chauhan (@mohitlaws) November 22, 2025