ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేంత జోరు మీదుంది బాలీవుడ్ భామ కృతి సనన్. ఇటీవలే వరుణ్ ధావన్‌తో కలిసి ‘భేడియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ నాయిక..ప్రస్తుతం ‘షెహజాదా’, ‘గణపథ్’ చిత్రాల వరుస రిలీజ్‌లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నది. ఆమె కెరీర్లో మరో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్నది ‘ఆది పురుష్’. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించారు.
రామాయణ ఇతిహాస నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్టులపై తాజాగా కృతి స్పందించింది. ఆమె మాట్లాడుతూ…‘చదివిన దాని కంటే చూసి తెలుసుకున్నవే ఎక్కువ గుర్తుంటాయి. ఈ విజువల్ మెమొరీ మరింత అందంగా ఉండాలంటే సినిమా ఒక మ్యాజిక్‌లా అనిపించాలి. రామాయణం మనకు ఎప్పటినుంచో తెలిసిన కథే అయితే దాన్ని నేటి తరం ప్రేక్షకులకు కొత్తగా చూపించాలంటే విజువల్ ఎఫెక్టులు కావాలి. ముఖ్యంగా ఇప్పటి పిల్లలు రామాయణ గాథ తెలుసుకోవాలి’ అని చెప్పింది.