Kriti Kharbanda Marriage | బాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బందా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌తో కృతి ఏడడుగులు వేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో శుక్రవారం వీరి వివాహం జరుగగా.. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వార్తను ఒకరోజు ఆలస్యంగా బయటపెట్టింది ఈ జంట. తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
‘బోణీ’ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది కృతి ఖర్బందా. ఆ తర్వాత ఒంగోలు గిత్త, ఓమ్, తీన్మార్, మిస్టర్ నూకయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2015లో వచ్చిన ‘బ్రూస్ లీ’ తర్వాత కృతి తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ ఫుక్రే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అనంతరం సనమ్ రే, పాగల్ పంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.