the warrior movie poster | ‘ఉప్పెన’ చిత్రంతో సినీరంగానికి పరిచయమైన కృతి శెట్టి ఉప్పెనలా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.. ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లతో జోరుమీదున్న కృతి శెట్టి ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంతో పాటు ‘ది వారియర్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ది వారియర్ చిత్రం నుండి కృతి శెట్టి పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కృతి శెట్టి ఈ చిత్రంలో విజిల్ మహాలక్ష్మిగా నటించనుంది. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ పోలిస్ అధికారిగా కనిపించనున్నాడు. ఆది పినిశెట్టి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన రామ్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా కృతి శెట్టి కూల్‌గా స్కూటర్ పైన పక్కకి తిరిగి ఎవరినో చూస్తున్నట్లు ఉన్న పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
😊 thank you #ValentinesDay #whistlemahalakshmi https://t.co/sd4hCIaZRg
— KrithiShetty (@IamKrithiShetty) February 14, 2022