Khadgam Re Release | టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ నటుడు ప్రభాస్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఆల్‌టైం బ్లాక్ బస్టర్ చిత్రం ఖడ్గం(Khadgam). 2002 నవంబర్ 29వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీకాంత్ (Srikanth), రవితేజ (Raviteja), ప్రకాశ్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాను అక్టోబర్ 18న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న కృష్ణవంశీ ప్రభాస్ సినిమాలపై కామెంట్స్ చేశాడు.
ప్రభాస్ లాంటి నటుడిని చక్రం లాంటి సెన్సిటివ్ పాత్రలు చేసేలా ఎలా ఒప్పించారు అని ఒక రిపోర్టర్ అడిగితే.. కృష్ణవంశీ సమాధానమిస్తూ.. చక్రం కథ ప్రభాస్‌కు చెప్పడానికి వెళ్లినప్పుడు మొదట ఒక యాక్షన్ కథ చెప్పాను అయితే అందరూ యాక్షన్ కథలే చెబుతున్నారు. ఏదైనా కొత్తగా అంటే చక్రం కథను చెప్పాను అయితే ఇది చెప్పిన వెంటనే కథను ఒకే చేశాడు. అయితే 20 ఏండ్లు అయిన ప్రభాస్ పరిస్థితి మారలేదని మంచి నటుడైన ప్రభాస్‌ను కేవలం యాక్షన్ సినిమాలకే పరిమితం చేస్తున్నారని.. అప్పుడప్పుడైన అతడితో ఫ్యామిలీ కాన్సెప్ట్ లాంటి సినిమాలు తీయండి అంటూ కృష్ణవంశీ చెప్పుకోచ్చాడు.