Krishna Leela | స్వీయ దర్శకత్వంలో దేవన్ (Devan) హీరోగా రూపొందిస్తున్న సూపర్‌నేచురల్ లవ్ స్టోరీ ‘కృష్ణ లీల’ (Krishna Leela) ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ (Dhanya Balakrishnan) హీరోయిన్గా నటిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో, జ్యోత్స్న నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సోమవారం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. “ప్రేమించడం, ప్రేమించబడటం రెండూ కర్మలే… ఈ ప్రేమను అనైతికంగా అనుభవించాలనుకున్నా, అది మరింత కాంప్లికేటెడ్ అయి, ఎన్ని జన్మలైనా సరైన పాఠం నేర్పే వరకు వదలదు” అనే పవర్ఫుల్ లైన్‌తో సినిమా కాన్సెప్ట్ స్పష్టమవుతోంది.
‘కృష్ణ లీల’ కథ రీబర్త్, ప్రేమ, కర్మ అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. గత జన్మలో విఫలమైన ప్రేమను ప్రస్తుత జన్మలో తిరిగి సాధించాలనుకునే ప్రేమికుడి కథగా సినిమా నడుస్తుంది. దేవన్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో నటించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాలో సీనియర్ నటులు వినోద్ కుమార్, బబ్లూ పృథ్వీ, తులసి ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే సెవన్ ఆర్ట్స్ సరయు, రవి కాలే, ఆనంద్ భారత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించారు.
ట్రైలర్ చూసినవారంతా ఈ సినిమా ఒక కొత్త కాన్సెప్ట్‌తో వస్తోందని చెబుతున్నారు. లవ్, రీబర్త్, సస్పెన్స్ అంశాలను కలిపి దర్శకుడు దేవన్ కొత్త రకం ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘కృష్ణ లీల’ను తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.