రిష్వి, తిమ్మరాజు, విస్మయశ్రీ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకుడు. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకటసుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్.