Krack Movie Sequel on cards | రెండేళ్ల క్రితం వచ్చిన ‘క్రాక్’ ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరోనా విజృంభిస్తున్న టైమ్‌లో.. దర్శక, నిర్మాతలు సినిమాలు విడుదల చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు క్రాక్ ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్నిచ్చింది. అది కూడా 50% ఆక్యూపెన్సీతో విడుదలై నిర్మాతల పాలిట కామధేనువుల కనక వర్షం కురిపించింది. ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్టు లేక నిరాశలో ఉన్న రవితేజకు క్రాక్ గ్రాండ్ కంబ్యాక్ అయింది. ఇక ఈ సినిమాతో గోపిచంద్ మలినేని పేరు ఒక్కసారిగా టాలీవుడ్లో మార్మోగిపోయింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.
గోపిచంద్ ఇటీవలే రవితేజను కలిసి క్రాక్ సీక్వెల్‌కు సంబంధించిన ఓ లైన్‌ను చెప్పాడట. రవన్నకు ఆ లైన్ బాగా నచ్చడంతో స్క్రిప్ట్‌ను రెడీ చేయమని చెప్పాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ‘ధమాకా’, ‘వాల్తేరు’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోరుమీదున్న ఉన్న రవితేజ స్పీడ్‌కు ‘రావణాసుర’ బ్రేకులు వేసింది. ప్రస్తుతం ఆయన నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సంక్రాంతికి వీరసింహా రెడ్డితో విజయ ఢంకా మోగించిన గోపిచంద్ మలినేని చేతిలో ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ లేదు.