Pranayagodari | సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకుడు. పీఎల్వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. శనివారం ఈ సినిమాలో ‘కలలో..కలలో’ అంటూ సాగే ప్రేమగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..పాటలోని సాహిత్యం, విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయని ప్రశంసించారు. గోదావరి నేపథ్యంలో అక్కడి అందాలు, ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన అందమైన ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఈదర ప్రసాద్, సంగీతం: మార్కండేయ, రచన-దర్శకత్వం: పీఎల్ విఘ్నేష్.