Praveena Parachuri | ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న నిర్మాత ప్రవీణ పరుచూరి మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapallilo Okappudu). దగ్గుబాటి రానా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా.. పరచూరి విజయ్ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి నిర్మించారు. ఈ సినిమాతో మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెలను వంటి నూతన నటీనటులు వెండితెరకి పరిచయం అవ్వగా.. ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్‌తో నడిచింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ఈ సినిమా ఆగష్టు 22 నుంచి విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది 1997 నాటి కొత్తపల్లి అనే మారుమూల గ్రామం కథ. ఊరి ప్రజలకు అప్పులిచ్చి, వడ్డీలతో పీడించేవాడు అప్పన్న (రవీంద్ర విజయ్). అతని దగ్గరే పనిచేసే రామకృష్ణ (మనోజ్ చంద్ర), ఆ ఊరి జమీందార్ రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి (మౌనిక)ని చిన్నతనం నుంచే ప్రేమిస్తాడు. అయితే, తన ప్రేమను ఆమెకు చెప్పే క్రమంలో అతనికి మరో అమ్మాయితో బలవంతంగా పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరోవైపు, అప్పన్న ఆకస్మిక మరణం తర్వాత ఆ ఊరిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అప్పన్న పట్ల ఆ ఊరి జనానికి ఉన్న భయం అపారమైన భక్తిగా ఎలా మారింది? అప్పన్నకు, రెడ్డికి మధ్య ఉన్న వైరం ఏమిటి? అసలు చివరికి రామకృష్ణ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Kothapalli పిలుస్తోంది! 🎬
Watch #KothapalliloOkappudu Premieres 22nd Aug only on #aha
(24hrs early access for Gold users)@RanaDaggubati @IamPraveenaP @SpiritMediaIN#KothapalliloOkappudu #RanaDaggubati #PraveenaParuchuri pic.twitter.com/IO08xuWGba— ahavideoin (@ahavideoIN) August 8, 2025