Kota Factory | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చిన వెబ్ సిరీస్‌లలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సిరీస్ ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory). ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో ఉన్న విద్యార్థుల జీవితాల ఆధారంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ విడుదలైన నాటి నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు విడుదల కాగా తాజాగా మూడో సీజన్ అనౌన్స్మెంట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. ‘కోట ఫ్యాక్టరీ’ 3వ సీజన్ 20 జూన్ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఇక పంచాయత్ వెబ్ సిరీస్ ఫేమ్ జితేంద్ర కుమార్ ఇందులో టీచర్‌గా నటించగా.. వైభవ్(మయూర్ మోర్) లీడ్ రోల్లో నటించాడు. ఐఐటీలో సీటు కోసం కోటా (Kota)లో వైభవ్(మయూర్ మోర్) పడిన ఇబ్బందులను ఆధారంగా ఈ వెబ్ సిరీస్ వచ్చింది. సౌరభ్ కన్నా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు. అహ్సాస్ చన్నా, మయూర్ మోర్, రేవతి పిళ్లై తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Aaj se taiyyari shuru🤓
Kota Factory: Season 3 comes to Netflix on 20 June📚#KotaFactoryS3OnNetflix pic.twitter.com/c7bIBGbcsP— Netflix India (@NetflixIndia) May 31, 2024