Kota Bommali P.S | మలయాళ అణిముత్యాల్లో నాయట్టు ఒకటి. పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బంపర్ హిట్. రెండేళ్ల కిందటే ఈ సినిమా హక్కులను అల్లు అరవింద్ కొనుగోలు చేశాడు. ముందుగా డబ్బింగ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్ చేద్దామనుకున్నాడు. కానీ కంటెంట్ వైజ్‌గా ఇదో అద్భుతమైన సినిమా అని భావించి, రీమేక్ ప్లాన్‌లో పడ్డాడు. పెద్ద స్టార్లతో గ్రాండియర్‌గా సినిమా తీయాలని ప్లాన్ చేశాడు. కానీ అది కుదరలేదు. దాంతో నటుడు శ్రీకాంత్‌ను ప్రధాన పాత్రలో పెట్టి తీశాడు. జోహార్, అర్జున ఫల్గుణ సినిమాలు చేసిన తేజ మార్ని ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకు కోట బొమ్మాళి P.S అనే పేరును ఫిక్స్ చేశారు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. పేరుకు మలయాళ సినిమానే అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు భారీ మార్పులు చేసినట్లు ఇన్సైడ్ టాక్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. లింగి లింగి లింగిడి అంటూ సాగే ఈ పాట మాస్ బీట్ సాంగ్‌ను శ్రీలీల లాంచ్ చేయనుంది.
ఇక ఈ మలయాళ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోను మంచి అంచనాలే ఉన్నాయి. మలయాళంలో ఈ సినిమా ఒరినల్ వెర్షన్‌ను చార్లీ దర్శకుడు మార్టిన్ ప్రక్కట్ తెరకెక్కించాడు. తాము చేయని హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారులు చిక్కుకుంటారు. ఈ కేసు నుంచి వాళ్లు బయటపడతారా? లేదా? చివరకు వాళ్ల జీవితం ఎలా మారింది? అనే కథాంశం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఇదే కథకు పొలిటిలికల్ టచ్ అప్ ఇచ్చి సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లాడు దర్శకుడు మార్టిన్. ఇక ఇప్పుడు తెలుగులో ఈ సినిమా రీమేక్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా శ్రీకాకుళంలో ఓ ఊరి పేరైన కోట బొమ్మాళి పేరు పెట్టడం విశేషం. గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ కానుంది.
Start dancing to the #SrikakulamMassFolklore in ONE HOUR ❤🔥#LingiLingiLingidi lyrical from #KotaBommaliPS out today 6 PM💥💥
Launch by the youth sensation @sreeleela14 ❤️
– https://t.co/0eHXRvFuHw@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @GA2Official @DirTejaMarni pic.twitter.com/iRpyaEgddd
— Maduri Mattaiah Naidu (@madurimadhu1) September 11, 2023