Prabhas – Don lee | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యానిమల్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’(Spirit) అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ పాన్ వరల్డ్ సినిమాలో విలన్‌గా కొరియాకు చెందిన హాలీవుడ్ స్టార్ హీరో డాన్ లీ(లీ డాంగ్ సిక్)ని తీసుకుబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజాగా ఆయన ఇన్‌స్టాలో ప్రభాస్ ఫొటోని షేర్ చేశాడు. దీంతో స్పిరిట్ మూవీలో డాన్లీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ట్రైన్ టూ బూసాన్, మార్వెల్ సిరీస్, ఎటర్నల్ సినిమాల ద్వారా ఈ సౌత్ కొరియన్ యాక్టర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే స్పిరిట్‌లో డాన్ లీ ఎంపిక అయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందట. అందుకే హాలీవుడ్ నటులపై దృష్టిసారించారు సందీప్‌రెడ్డి వంగా. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తారని గతంలో సందీప్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది.