దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీద ఫిల్మ్ అవార్డ్స్ అందించారు. భారత్ ఆర్ట్స్ అకాడెమీ, ఏబీసీ ఫౌండేషన్, వాసవి ఫిల్మ్ అవార్డ్స్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ పురస్కారాల కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, నటి దివ్యవాణి, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. హీరో సుమన్‌కు జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ…‘కోడి రామకృష్ణ ఒక అద్భుతమైన దర్శకుడు.
ఆయన లేకపోవడం ఇండస్ట్రీకి తీరని లోటు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడ్డారు. నాకు నటుడిగా జీవితాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన పేరు మీద జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.