భక్తిరస చిత్రాలకి గ్రాఫిక్స్ జోడించి ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని అందించే దర్శకుడు కోడి రామకృష్ణ. అరుంధతి వంటి సూపర్ హిట్ చిత్రంతో కోడి రామకృష్ణ పేరు మారుమ్రోగిపోయింది. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలు తెరకెక్కించిన కోడి రామకృష్ణ అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కోడి రామకృష్ణ మరణించారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కూతురు తీసుకుంది.
కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు.తొలి సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్నాడు. ‘రాజావారు రాణిగారు’తో హీరోగా పరిచయం అయిన కిరణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో ప్రయత్నంగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేసారు కిరణ్.
ఇప్పుడు దివ్య దీప్తితో కలిసి కిరణ్ ఓ సినిమా చేయనుండగా, ఈ చిత్రాన్ని కార్తీక్ శంకర్ కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు మరి కొద్ది రోజులలో వెల్లడించనున్నారు.
KODI RAMAKRISHNA presents !
— BA Raju's Team (@baraju_SuperHit) July 15, 2021
Kodi RamaKrishna's elder daughter @kodidivya announces her new production @KodiDivyaaEnt 's venturing into Production with @KiranAbbavaram 's #KA5 💥
A #ManiSharma Musical 🎹
Directed by #KaarthikShankar 🎬#HBDKiranAbbavaram pic.twitter.com/k5AjhBG7qI