OTT| ఈ మధ్య కాలంలో ఎత పెద్ద హిట్ అయిన సినిమా అయిన రిలీజ్ అయిన కొద్ది రోజుల వ్యవధిలోనే థియేటర్స్‌లోకి వచ్చేస్తుంది. సినిమా హిట్ అయితే రెండు నెలల్లో ఓటీటీలో సందడి చేస్తుంది. అదే యావరేజ్ అయితే నెల కాకముందే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని సినిమాలు థియేటర్స్‌లో పెద్దగా హిట్ కాకపోయిన ఓటీటీలో మాత్రం సందడి చేశాయి. థియేటర్లలో బొక్క బోర్లా పడ్డ పడి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఆ రెండు సినిమాలు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.
ఈ ఏడాది ఒకే రోజు థియేటర్లలో విడుదలైన సినిమాలు థియేటర్స్‌లో పెద్దగా అలరించలేకపోయాయి. కాని ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అవి మరేవో కాదు ఎమర్జెన్సీ.. ఆజాద్. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ చిత్రం ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించి అలరించింది. అయితే దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.
కాకపోతే నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం టాప్ 3 ట్రెండింగ్ ప్లేస్ లో ఉంది. అంతేకాదు ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీ 5.2 రేటింగ్ ఇచ్చింది. ఇక థియేటర్స్‌లో విడుదలై నిరాశపరిచిన మరో చిత్రం ఆజాద్ కాగా, ఈ మూవీ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. ఇందులో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ హీరోగా నటించారు. రవీనా టాండన్ కూతురు రాషా తడానీ కథానాయికగా నటించింది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా.. కేవలం రూ.10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా . ఓటీటీ టాప్ 4 ట్రెండింగ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.