Kisi Ka Bhai Kisi Ki Jaan Movie On Ott | దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రెండేళ్లలో సల్మాన్ నుంచి రెండు సినిమాలు రాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. తీరా రిలీజయ్యాక డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక సల్మాన్‌కు వరుసగా మూడో డిజాస్టర్‌గా మిగిలింది.
ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. జూన్ 23 నుంచి ఈ సినిమా జీ-5లో స్ట్రీమింగ్ కానుంది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వీరమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగులో ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశాడు. ఇక హిందీ వెర్షన్లో సల్మాన్‌కు జోడీగా పూజాహెగ్డే నటించింది. వెంకటేష్ పూజా హెగ్డేకు అన్నగా కీలకపాత్ర పోషించాడు. జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఏప్రిల్ మాసంలో విడుదలైన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు తేరుకోని నష్టాలు మిగిల్చింది.