Kisi ka Bhai Kisi Ki Jaan Collections | దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రెండేళ్లలో సల్మాన్ నుంచి రెండు సినిమాలు రాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా టీజర్, ట్రైలర్లు కూడా బాలీవుడ్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సారి సల్మాన్ గట్టిగా కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడనే వార్తలు కూడా వచ్చాయి.
కాగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది సినిమా అద్భుతంగా ఉందంటే.. మరికొంత మంది రొటీన్ సినిమా అంటూ వాళ్ల అభిప్రాయాలు తెలిపారు. మొత్తం చూసుకుంటే సల్మాన్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్ అన్న మాటలు కూడా వినిపించాయి. ఇక ఇదిలా ఉంటే సల్మాన్‌కు ఈద్ పండగ ప్రత్యేకం. ఈద్ సందర్భంగా రిలీజైన అన్ని సినిమాలు సల్మాన్‌కు భారీ విజయాలుగా నిలిచాయి. కానీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా మాత్రం సల్మాన్‌కు చేదును మిగిల్చింది.
నిజానికి రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్ చూసి ఈ సినిమా సల్మాన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ పదేళ్లలో ఈద్‌కు రిలీజైన సినిమాలన్నిటిలో ఇదే అత్యల్ప కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. 2010లో వచ్చిన దబాంగ్ రూ.14.5 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అప్పుడున్న టిక్కెట్ రేట్లకు, క్రేజ్‌కు అది ఓ రికార్డు. కానీ పదమూడేళ్ల తర్వాత వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ కేవలం రూ. 15.81 కోట్లు సాధించి సల్మాన్ పేరిట చెత్త రికార్డు నెలకొల్పింది.
ఈ పదమూడేళ్లలో ఈద్‌కు సల్మాన్ నుంచి ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి. ప్రతీ సినిమా కోట్లు కొల్లగొట్టింది. కానీ ఇది మాత్రం సల్మాన్‌కు నిరాశను మిగిల్చింది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వీరమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా పూజాహెగ్డే నటించింది. వెంకటేష్ పూజా హెగ్డేకు అన్నగా కీలకపాత్ర పోషించాడు. జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.
#Xclusiv… SALMAN KHAN & EID: *DAY 1* BIZ…
2010: #Dabangg ₹ 14.50 cr
2011: #Bodyguard ₹ 21.60 cr
2012: #EkThaTiger ₹ 32.93 cr
2014: #Kick ₹ 26.40 cr
2015: #BajrangiBhaijaan ₹ 27.25 cr
2016: #Sultan ₹ 36.54 cr
2017: #Tubelight ₹ 21.15 cr
2018: #Race3 ₹ 29.17 cr
2019:… pic.twitter.com/LKeT1He9G3— taran adarsh (@taran_adarsh) April 22, 2023