kiran abbavarm | వైవిధ్య భరిత సినిమాలలో నటిస్తూ సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’, ‘SR కళ్యాణ మండపం’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న కిరణ్ అబ్బవరం ఈ సారి ‘సెబాస్టియన్’ చిత్రంతో ఎలాగైనా హ్యట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్గా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది.
‘భీమ్లానాయక్’ చిత్రాన్ని మేకర్స్ ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేయాలని రెండు డేట్లను ఫిక్స్ చేసుకున్నారు. ఏపీలో నైట్ కర్ఫ్యూ, 50% ఆక్యూపెన్సీ, టికేట్ రేట్ల విషయంలో క్లారిటి వచ్చేదాకా ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని భీమ్లానాయక్ మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ విషయాలపై సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. మరో వారం పదిరోజుల్లో ఈ విషయాలపై క్లారిటి రానున్నట్లు సినీ ప్రముఖులు తెలిపారు. దీన్ని బట్టి భీమ్లానాయక్ చిత్రం విడుదల పోస్ట్ పోన్ అవ్వచ్చు అని భావించి పలు మీడియం బడ్జెట్ సినిమాలు తమ తమ సినిమాలను ఫిబ్రవరి25న విడుదలచేయనున్నట్లు ప్రకటించారు.
కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ కూడా ఫిబ్రవరి 25న విడుదల కానున్నట్లు ప్రకటించారు. కానీ సడెన్గా భీమ్లా నాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో సెబాస్టియస్ చిత్రం రేసు నుంచి తప్పుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వారం వాయిదా వేసి మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గతంలోనే కిరణ్ ట్విట్టర్లో జరిపిన చిట్ చాట్లో ఓ నెటిజన్ ఈ హీరోకు ఓ ఆసక్తికర ప్రశ్న సందించాడు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల ఉందని మీకు తెలియదా భయ్యా.. ఆరోజే మీ సెబాస్టియన్ పి సి 524 ను రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన మీరు అదే రోజు మీ సినిమాను విడుదల చేస్తారు అని నెటీజన్ అడిగాడు. దీనికి స్పందించిన యంగ్ హీరో నేను మీకంటే కాస్త ఎక్కువగానే భీమ్లా నాయక్ కోసం ఎదురు చూస్తున్నాను.. ఆరోజు నా సినిమా విడుదల అయినా కూడా నేను పవర్ స్టార్ సినిమాకే మొదటి షో వెళతాను.. ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ తోనే అని రిప్లై ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఏకంగా తన సినిమాను వాయిదా వేసుకున్నాడు.