Kiran Abbavaram’s sammathame teaser | వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవలే సెబాస్టీయన్ వంటి వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం సమ్మతమే. గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయన్‌గా నటించింది. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు. గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 24న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఐ లవ్ యూ కృష్ణ’ .. ‘అయ్యో ఈ పెళ్ళికి ముందు ప్రేమనేది నాకు పడదండి, అందులో నేను పడను’ అంటూ టీజర్ ప్రారంభమైంది. ‘లవ్ అంటే తెలీదా.. ఇక్కడేమన్న ఎర్రి ఎదవ అని రాసుందారా’ అంటూ సద్దామ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తుంది. ‘లవ్ అంటే ఎంటో తెలియాలి అంతే కాదా.. ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు ఫీజ్ కొట్టేసిందా’ అంటూ యాదమ్మ రాజు, హీరోకు చెప్తుంటాడు. ఇక నెక్స్ట్ ఫ్రేమ్‌లోనే హీరోయిన్ చాందిని కనిపిస్తుంది. ‘తాగుబోతులా ఉన్నారే’ అంటూ చాందిని అనగా ‘ఈ బాటిల్ మీదే కదా అంటూ ఖాళీ బాటిల్‌ను చాందినికి చూపించి గజతాగుబోతులా ఉన్నారు’ అంటూ రివర్స్ పంచ్ వేస్తాడు. ‘మీది ఏ రిలీజియన్.. డీసి ఆ, మార్వెల్ ఆ.. అవేవి మనకు తెలియదండి, మనకేదైనా బాలయ్య బాబే’ అంటూ ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు ఆకట్టకుంటున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం వినపొంపుగా ఉంది. సతీస్ రెడ్డి కెమెరా తనం మెచ్చుకునేలా ఉంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.