యువ హీరో కిరణ్ అబ్బవరం తన స్వీయ నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైర ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించనున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేదశ్రీ జంటగా నటిస్తున్నారు. మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా ఇదని, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నదని, ఈ సంవత్సరాంతంలో షూటింగ్‌ను ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. వేదశ్రీ, ప్రదీప్ కొట్టె, తేజ విహాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అక్షయ్ రామ్ పొదిశెట్టి, నిర్మాత: కిరణ్ అబ్బవరం, రచన-దర్శకత్వం: వి.మునిరాజు.