Kiran Abbavaram | యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ చిత్రానికి ‘క’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్లో కిరణ్ అబ్బవరం సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిదని, చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సంగీతం: సామ్ సీఎస్, దర్శకత్వం: సుజీత్, సందీప్.