కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ “క”. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. దీపావళి కానుకగా ఈ నెల 31న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్‌మీట్ జరిగింది. ‘ఇది కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్. 70వ దశకంలో జరిగే కథ. ఈ జనరేషన్‌తో పాటు పెద్దవాళ్లకు కూడా నచ్చే సినిమా ఇది. అభిరుచి గల ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది.’ అని కిరణ్ అబ్బవరం చెప్పారు. ‘అభినవ్ వాసుదేవ్ అనే ఓ పోస్ట్‌మేన్ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారం ఈ సినిమా కథ’ అని దర్శకులు తెలిపారు. ఇంకా పంపిణీదారుడు వంశీ నందిపాటి, కథానాయిక తన్వీరామ్, సహ నిర్మాత చింతా రాజశేఖరెడ్డి కూడా మాట్లాడారు.