Kiran Abbavaram- Rahasya Gorak | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం. ఈ మూవీతోనే తెలుగు తెరకు కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది రహస్య గోరఖ్. ఈ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత రిలేషన్ పెళ్లి వరకు వెళ్లింది. కిరణ్ అబ్బవరం ఇటీవలి కాలంలో క అనే సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ జోష్లో మరిన్ని సినిమాలని లైన్లో పెట్టాడు. అయితే కొన్నాళ్ల కితం ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నట్టు తెలియజేశారు.
తాజాగా కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరఖ్ సీమంతం వేడుక ఘనంగా జరిపినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఫోటోస్ తన ఇన్ స్టాలో పంచుకున్నారు రహస్య. అందులో బేబీ బంప్, కిరణ్ అబ్బవరంతో కలిసిన ఫోటోస్ ఉన్నాయి. ఇవి చూసిన ఆమె ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’తో పలకరించిన సంగతి తెలిసిందే. ఈ పిక్స్ చూసిన తర్వాత నెటిజన్స్ పలువురు సెలబ్రిటీలు రహస్య, కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రహస్య సినిమాలకి బ్రేక్ ఇవ్వగా, కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు.
క’ సినిమా ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం తనపై వచ్చే ట్రోలింగ్స్ పై ఓపెన్ గానే మాట్లాడారు. ఎలాంటి ఇండస్ట్రీ నేపధ్యం లేకుండా ఎదుగుతున్న తనని ఎందుకింత ట్రోల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో ట్రోలర్స్ కి ‘క’సినిమాతో సమాధానం చెబుతానని చెప్పి, నిజంగానే ఆ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కిరణ్ కెరీర్ లో ‘క’ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచింది. ‘క’ సినిమాకి ముందు కిరణ్ చేసిన దాదాపు సినిమాలు మాస్ నేపథ్యంలో వచ్చినవి. హీరో ఇమేజ్ కి, చేస్తున్న క్యారెక్టర్ సంబంధం లేకుండా ఉండడంతో కాస్త ట్రోలింగ్ ఎక్కువగా నడిచింది.. ‘క’ మాత్రం కథ, కాన్సెప్ట్ ని నమ్మి చేసిన సినిమా. ఎక్కడ కూడా అనవసరమైన ఎలివేషన్ లేకుండా సాగిన ఈ సినిమా ఆడియన్స్ మెప్పించింది. కిరణ్ పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.