K Ramp | భారతీయ సినిమా రంగంలో హీరోల్ని దేవుళ్లుగా పూజించే సంప్రదాయం పాతకాలం నుండి కొనసాగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వ్యక్త పరిచేందుకుగాను ప్రీ-రిలీజ్, ఫిల్మ్ ఈవెంట్లలో సడెన్‌గా వెళ్లి వారి కాళ్ల మీద పడడం మనం చూస్తూ ఉంటాం. అయితే, తాజాగా కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’ ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
సభ వేదిక ముందు కిరణ్ కూర్చుని ఉన్న సమయంలో ఒక అభిమాని హఠాత్తుగా వచ్చి ఆయన కాళ్ల మీద పడ్డాడు. ఈ సంఘటనతో షాక్ అయిన హీరో, ఆ వ్యక్తిని లేపి “ఇలా చేయడం తప్పు” అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చి పంపించాడు. ఆ సమయంలో పక్కనే కూర్చున్న సీనియర్ నటుడు నరేష్ ఆ దృశ్యాన్ని సరదాగా వీక్షించాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది అభిమానం పేరుతో ఇలా కాళ్ల మీద పడడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. కొందరు “ఇది అభిమానం కాదు, పైశాచికానందం” అని వ్యాఖ్యానించారు. మరికొందరు “హీరోకు గౌరవం ఇవ్వాలంటే ఇలా చేయాల్సిన అవసరం లేదు”, “ఇది బానిసత్వం” అని వ్యాఖ్యలు చేశారు.
అభిమానులు హీరోల సినిమాలను ప్రోత్సహించడం, గౌరవించడం చాలానే చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో ఇలా ప్రవర్తించడం హీరోలకి ఎంతో అసౌకర్యంగా ఉంటుందని కొందరు అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, నాని, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ వంటి హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చాలామంది సడెన్‌గా వచ్చి కాళ్లు పట్టుకున్న సందర్బాలు మనం చూశాం. ఇలాంటి పద్దతి ఏ మాత్రం మంచిది కాదని కొందరు హితవు పలుకుతున్నారు.
#KiranAbbavaram is Upset due to One Of his Cult fan Touching his Feet!!#KRamp
— cinee worldd (@Cinee_Worldd) October 16, 2025