Kiran abbavaram- Rahasya |యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ‘క’ సినిమా సక్సెస్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం ద్వారా కొత్తగా కనిపించాడు. సుజిత్ – సందీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కిరణ్ ‘K-Ramp’ అనే కొత్త ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు.
ఇటీవలే విడుదలైన ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది. పంచకట్టులో ఎనర్జిటిక్ లుక్‌తో కిరణ్ ఆకట్టుకున్నప్పటికీ, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై నెటిజన్ల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ, కిరణ్ మాస్, ఫన్ స్టైల్ తో మరోసారి ఆకట్టుకున్నాడు.ఈ సినిమాను జేమ్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్ – రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్‌పై యుక్తి తరేజా, రాజేశ్ దండ, శివ బొమ్మక్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
కిరణ్ అబ్బవరం- రహస్య 2024 ఆగస్టు 22న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం 2025 మేలో తల్లి తండ్రులయ్యారు. అయితే నేడు ఈ జంట ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కిరణ్ తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. మరోవైపు పలువురు ప్రముఖులు, నెటిజన్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇటీవల కిరణ్ అబ్బవరం -రహస్య గోరఖ్ దంపతులకు పండంటి అబ్బాయి జన్మించగా, తమ కొడుకు నామకరణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా నిర్వహించారు. తన కుమారుడికి ‘హను అబ్బవరం’ అనే పేరు పెట్టిన కిరణ్, ఇదే సందర్భంగా తొలిసారి బాబు ఫోటోను పబ్లిక్‌గా షేర్ చేశారు. ఫోటోలో పంచకట్టుతో, నుదుటిపై నామాలు వేసుకుని ఉన్న చిన్నారి హను అబ్బవరం అందరినీ మంత్రముగ్ధులను చేస్తూ క్యూట్‌నెస్‌తో సోషల్ మీడియాను షేక్ చేసాడు.