Kiran Abbavaram New Movie | గత ఏడాది ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న దిల్ రుబా చిత్రం ఈ నెల ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. కే రాంప్ అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ కిరణ్ కెరీర్లో 11వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమలు నేడు రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించారు. ప్రముఖ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టాడు. అనంతరం టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
హాస్య మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు రాజేశ్ దండా నిర్మిస్తుండగా.. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
Excited to bring #KRamp to life with an incredible team✨
With the blessings of the almighty, the pooja ceremony of #Hasya7, #KRamp has commenced! 🎬💥
The game begins soon on sets! ⚽🔥Gear up for an entertaining ride!@Kiran_Abbavaram @realyukti… pic.twitter.com/E4HVpbkCty
— Razesh Danda (@RajeshDanda_) February 3, 2025