మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్స్టన్’. కమల్ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నది. సోమవారం జీవీ ప్రకాష్ కుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సముద్రం నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ చిత్రమిది.
సాగర గర్భంలో నిధుల అన్వేషణ కోసం హీరో చేసే సాహనయత్నాలు, ఈ క్రమంలో చోటుచేసుకునే సంఘటనలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతాయి. ఈ కథలో థ్రిల్లింగ్, సూపర్‌నేచురల్ అంశాలుంటాయి. యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా సాగుతాయి. ఈ నెల 9న టీజర్‌ను విడుదల చేయబోతున్నాం’అని తెలిపారు. దివ్యభారతి, ఆంటోని, చేతన్, కుమార్వేల్, సాబుమోహన్ తదితరులు చిత్ర తారాగణం.