ముంబై : బాలీవుడ్ నటి కిమ్ శర్మ.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఇటీవల గోవా బీచ్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య డేటింగ్ నడుస్తున్నట్లు ఆ టైమ్‌లో ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు కిమ్ శర్మ మరో లేటెస్ట్ ఫోటోను తన ఇన్‌స్టాలో అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలో లియాండర్ పేస్, కిమ్ శర్మలు క్యూటీగా కనిపిస్తున్నారు. ఇన్‌స్టా ఫోటోలతో టీజింగ్ చేస్తున్న ఆ జంట ఇప్పుడు తమ మధ్య ఉంది ప్రేమబంధమే అన్న సంకేతాన్ని ఇచ్చేశారు. కొత్తగా పోస్టు చేసిన ఫోటోలో.. లియాండర్ ఎంతో గాఢంగా కిమ్‌ను చూస్తూ ఉండిపోయాడు. ఆ ఫోటోలో కిమ్ కూడా ఎంతో సంతోషంగా కనిపించింది. ఇన్‌స్టాలో పెట్టిన ఫోటోకు ఎటువంటి ట్యాగ్ లైన్ ఇవ్వలేదు కిమ్. కానీ ఆమె కొన్ని ఎమోజీలతో తన ఇంట్రెస్ట్‌ను చెప్పేసింది. కిమ్ నుంచి కళ్లను తిప్పలేకపోతున్న లియాండర్ .. ఆ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దానికి మ్యాజిక్ అని ఓ కామెంట్ పెట్టి.. తాను కిమ్ మాయలో పడ్డట్లు చెప్పేశాడు.