Ram Charan Kill Movie Director | బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం కిల్ (Kill Movie). యువ నటులు లక్ష్ లాల్వానీ (Lakshya),Kill Movie తాన్య మనక్తిలా (Tanya Maniktala), రాఘవ్ జుయల్ (Raghav Juyal) ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించగా.. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది జూలై 05న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌కి అయితే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల కూడా ఫిదా అయ్యారు.
అయితే ఈ సినిమా దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ తన తర్వాతి ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నిఖిల్ నగేశ్ భట్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. మైథాలాజికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్‌తో నిఖిల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కి పండగనే చెప్పుకోవచ్చు. కాగా ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు రామ్ చరణ్ ఆర్సీ16 షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.