Kill Movie Director | ‘కిల్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా సినీ ప్రియులను ఆకట్టుకున్న దర్శకుడు నిఖిల్ నాగేశ్ భట్. ఈ దర్శకుడు ఇప్పుడు హాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూనివర్సల్ స్టూడియోస్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్‌ను చేయనున్నట్లు సమాచారం. కొంతకాలంగా నిఖిల్, యూనివర్సల్ స్టూడియోస్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ కూడా ఒక భారీ యాక్షన్ సినిమా అని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం నిఖిల్ అమెరికా నటులనే ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి.